నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌ | dear comrade movie press meet | Sakshi
Sakshi News home page

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

Jul 28 2019 6:16 AM | Updated on Jul 28 2019 6:16 AM

dear comrade movie press meet - Sakshi

చెర్రీ, నవీన్, విజయ్, రష్మిక, భరత్, యష్, రవిశంకర్‌

‘‘డియర్‌ కామ్రేడ్‌’ నాకు చాలా పర్సనల్‌ ఫిల్మ్‌. చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. సంవత్సరం నుంచి మా ఎమోషన్స్‌ అన్నీ ఇందులో పెట్టాం. బాబీ, లిల్లీ అనే రెండు పాత్రల ప్రయాణం, కలలు, కష్టాలు, వాళ్ల ఫైట్‌ నాకు పర్సనల్‌. మా ఫ్రెండ్స్‌ అందరూ ఊరికే ఏడుస్తున్నావ్‌ ఏంటి? అని అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత నేను ఎమోషనల్‌గా మారిపోయాను’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్, యష్‌ రంగినేని నిర్మించారు.

గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన రెస్పాన్స్‌ లభిస్తోంది. మొదటిరోజు 11.2 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ హ్యాపీ.  సోమవారం–మంగళవారంలోపు అన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్, స్త్రీలు, ఫ్యామిలీ అందరూ ఎంటర్‌టైనర్‌ అవుతున్నారు. ఇదే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు యష్‌. ‘‘సొసైటీలో ఉన్న సీరియస్‌ ఇష్యూను బాగా డీల్‌ చేసిన సినిమా ఇది’’ అన్నారు చెర్రీ.

‘‘నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నమిది. నిన్న కొన్ని థియేటర్స్‌ సందర్శించాం. సినిమా పూర్తయిన తర్వాత నిలబడిని చప్పట్లు కొడుతున్నారు. చూసిన వాళ్లందరూ ఎమోషనల్‌ అవుతున్నారు’’ అన్నారు భరత్‌ కమ్మ. ‘‘ఫస్ట్‌ నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. ‘మేం చాలా కనెక్ట్‌ అయ్యాం’ అని అంటున్నారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘నాకు కలెక్షన్స్‌ సరిగ్గా అర్థం కావు కానీ మా సినిమాను చాలామంది చూశారు, ఇంత ప్రేమను మాకు అందించారు.

అందరికీ థ్యాంక్స్‌. నాలుగు భాషల్లో ఈ సినిమా చేశాం. థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని తీసుకురావడం నా బాధ్యత. చాలా మందికి రీచ్‌ అయింది. థియేటర్స్‌ను నింపిన నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌. అన్ని రకాల ఫీడ్‌బ్యాక్స్‌ తీసుకుంటున్నాం. స్లోగా ఉంది అంటున్నారు, టచ్‌ చేశావ్‌ అంటున్నారు. ఈ కథను ఇలానే చెప్పాలి. స్లోగా ఉన్నా ఎంజాయ్‌ చేస్తారు. మా టీమ్‌ను చూసి గర్వంగా ఉంది. అన్నీ కుదిరితే సక్సెస్‌మీట్‌ కాకినాడలో చేస్తాం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement