‘సర్కార్‌’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్‌ | Date Locked For Vijay Murugadoss Sarkar Teaser | Sakshi
Sakshi News home page

Aug 18 2018 3:40 PM | Updated on Aug 18 2018 7:38 PM

Date Locked For Vijay Murugadoss Sarkar Teaser - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో సర్కార్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా లాస్‌ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో పరిచయ గీతంతో పాటు పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. విజయ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కనిపించనున్నారు.

షూటింగ్‌ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్‌ చేస్తున్నారు. చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 13న విజయ్‌ సర్కార్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement