దసరాకు విలన్‌ | Dasara release for Shivarajkumar and Sudeep’s The Villain | Sakshi
Sakshi News home page

దసరాకు విలన్‌

Sep 16 2018 12:57 AM | Updated on Sep 16 2018 12:57 AM

Dasara release for Shivarajkumar and Sudeep’s The Villain - Sakshi

సుదీప్, అమీ, శివరాజ్‌కుమార్‌

రెండున్నరేళ్ల క్రితం ‘ది విలన్‌’ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు టీమ్‌. ఇందులోని యాక్టర్స్‌ డేట్స్‌ కుదరకపోవడం, అమీ జాక్సన్‌ విసా ప్రాబ్లమ్, వర్షం తాకిడికి లొకేషన్‌లో ఇబ్బంది కలగడం వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. దీంతో రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను దసరాకి రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమ్‌ దర్శకత్వంలో శివరాజ్‌ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌లు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్‌ మూవీ ‘ది విలన్‌’.

రామ్‌ ఆర్‌ రావణ్‌ అనేది ఉప శీర్షిక. సీఆర్‌ మనోహర్‌ నిర్మించారు. శ్రీకాంత్, మిధున్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేయనున్నట్లు దర్శకుడు ప్రేమ్‌ పేర్కొన్నారు. ‘‘కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్‌ 18న సినిమాను విడుదల చేయబోతున్నాం. సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ప్రేమ్‌. యాక్టర్‌ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువకుడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని శాండిల్‌వుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement