అప్పుడు మద్యానికి బానిసయ్యా: డేనియల్‌

Daniel Radcliffe Said Harry Potter Turned Him Into An Alcoholic - Sakshi

హ్యారీపొటర్‌‌ ఫేమ్‌ డేనియల్ రాడ్‌క్లిఫ్ ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను విపరితంగా మద్యం సేవించేవాడినని వెల్లడించాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేనియల్‌ మాట్లడుతూ.. హ్యారీపొటర్‌ సినిమా సమయంలో మద్యం తనని ఎంతగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా వివరించాడు. ‘యువనటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోవాలని చాలా కష్టపడ్డాను. అయితే హ్యారీపొటర్‌లోలో తెలివైన అబ్బాయిగా కనిపించిన నేను... వాస్తవ జీవితంతో దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాను. తరచూ మద్యం సేవిస్తూ ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడిని. ఆ సమయంలో తనపై వీపరితంగా విమర్శలు వచ్చేవని ఇక వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు మరింతగా మద్యం సేవించేవాడిని’ అని అప్పటీ చేదు అనుభవాలను పంచుకున్నాడు. (నాకు నటించడం రాదు: నటుడు)  

2010 నుంచి మంచి నటుడిగా ఉన్న డేనియల్‌ తన స్నేహితుల సహాయంతో తాగడం మానేసినట్లు పేర్కొన్నాడు. ‘‘ఓ రోజు ఉదయం లేవగానే.. నన్ను నేను ప్రశ్రించుకున్నాను. ఇంతగా మద్యానికి బానిసకావడం మంచిది కాదని.. మానేయాలని నిర్ణయించుకున్నానని. మద్యం మానేయాలనేది నా స్వంతంగా తీసుకున్ననిర్ణయం’’ అని చెప్పాడు. అయితే  ‘‘నేను మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా షూటింగ్‌కి వేళ్లడం మానలేదు. ఎందుకంటే నేను నా వృత్తిని ఇష్టపడతాను. సెట్‌లో ఉన్నంత సేపు నా వ్యక్తిగత ఆలోచనలు ప్రభావితం చేసే రోజు ఒక్కరోజు కూడా రాలేదు. ఇందుకు చాలా సంతోషం. ఇక హ్యారీపొటర్‌ నాటి పరిస్థితులు నా జీవితంలో ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్న’’ అని పేర్కొన్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top