నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ... | damaal dumeel movie | Sakshi
Sakshi News home page

నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ...

Mar 8 2016 11:11 PM | Updated on Sep 3 2017 7:16 PM

నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ...

నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ...

సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా శ్రీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన

 సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా శ్రీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఢమాల్ డుమీల్’ చిత్రం తెలుగులోకి ‘ధనాధన్’ పేరుతో విడుదల కానుంది. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని అనువదించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం కూర్చారు. ‘‘ఈ చిత్రం తమిళంలో విజయవంతమై, వైభవ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
 
 తెలుగులో కూడా విజయం సాధించి నిర్మాతలకు లాభాలు రావాలి. వైభవ్ తమిళంలో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు’’ అని కోదండ రామిరెడ్డి ఈ చిత్రం ఆడియో వేడుకలో పేర్కొన్నారు. ‘‘ఇది మంచి కామెడీ థ్రిల్లర్. ఈ నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని శివ వై.ప్రసాద్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement