‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్‌ పురస్కారం | Dadasaheb Phalke Award for Vishwanath Biopic Vishwadarshanam | Sakshi
Sakshi News home page

‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్‌ పురస్కారం

May 2 2019 12:02 PM | Updated on May 2 2019 12:02 PM

Dadasaheb Phalke Award for Vishwanath Biopic Vishwadarshanam - Sakshi

‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌  జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. కె.విశ్వనాథ్‌ లీడ్‌ రోల్‌లో పీపుల్స్‌ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు.

ఇటీవల ‘సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్‌) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. దాదాసాహెబ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక జ్యూరీ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది.

ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడంతో నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement