వర్మగారి కూతురు | D/O Varma - Telugu movie, Directed by Khaja, Starring Vennela Kishore | Sakshi
Sakshi News home page

వర్మగారి కూతురు

Sep 25 2013 1:16 AM | Updated on Aug 28 2018 4:30 PM

వర్మగారి కూతురు - Sakshi

వర్మగారి కూతురు

‘వెన్నెల’కిషోర్, నవీనా జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘డాటరాఫ్ వర్మ’. నాటక రచయితగా 9 పురస్కారాలు అందుకున్న కాజా ఈ చిత్రానికి దర్శకుడు. నరేందర్‌రెడ్డి బొక్కా ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ సెలబ్రిటీ అయిన తండ్రి, అతని కూతురు మధ్య జరిగే కథ ఇది. టామ్ అండ్ జెర్రీ కథలా ఫన్నీగా ఉంటుంది. వెన్నెల కిషోర్ నటన ఈ చిత్రానికి హైలైట్. రోజా రిపోర్టర్‌గా భిన్నమైన పాత్ర చేశారు. పాటలు, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. 
 
 ఆద్యంతం అలరించే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘నవీనా జాక్సన్‌కి తండ్రిగా నటించాను. దర్శకుడు నాపై నమ్మకంతో ఈ పాత్ర ఇచ్చాడు. భవిష్యత్తులో గొప్ప దర్శకుడవుతాడు’’ అని ‘వెన్నెల’కిషోర్ చెప్పారు. ఇందులో తండ్రీ కూతుళ్ల లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా బాగుంటుందని కథానాయిక నవీనా చెప్పారు. సంగీత దర్శకుడు అదేష్ రవి కూడా మాట్లాడారు.
 
Advertisement
 
Advertisement
Advertisement