క్యూట్ లవ్‌స్టోరీ | Cute Love Story | Sakshi
Sakshi News home page

క్యూట్ లవ్‌స్టోరీ

Oct 19 2014 11:14 PM | Updated on Sep 2 2017 3:06 PM

క్యూట్ లవ్‌స్టోరీ

క్యూట్ లవ్‌స్టోరీ

ప్రిన్స్, రేష్మీ జంటగా సూర్య చక్ర ఫిలింస్ పతాకంపై తాడి గనిరెడ్డి, కె. భువనేశ్వరి నిర్మిస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘అందాల రాముడు’

 ప్రిన్స్, రేష్మీ జంటగా సూర్య చక్ర ఫిలింస్ పతాకంపై తాడి గనిరెడ్డి, కె. భువనేశ్వరి నిర్మిస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘అందాల రాముడు’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పి. లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  శనివారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు.  ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రం ఉంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇందులో ఓ ముఖ్య పాత్రను బ్రహ్మానందంగారు చేస్తున్నారు. ఈ నెల 26న చిత్రీకరణ మొదలుపెడతాం.’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: జోషి, సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: నందమూరి హరి.
 

Advertisement
 
Advertisement
Advertisement