ప్రభాస్‌తో యువతి సెల్ఫీ.. వీడియో వైరల్‌ | Crazy Prabhas Fan Slaps Him After Taking Selfie | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో యువతి సెల్ఫీ.. వీడియో వైరల్‌

Mar 5 2019 2:23 PM | Updated on Mar 5 2019 2:39 PM

Crazy Prabhas Fan Slaps Him After Taking Selfie - Sakshi

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజే మారిపోయింది. ఈసినిమా సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్‌. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అందుకే ఇండియాలోనే కాదు.., ప్రభాస్‌ విదేశాలకు వెళ్లినా అభిమానులు ఆయన్ను వదిలిపెట్టడం లేదు.

ఇటీవల ప్రభాస్‌ సాహో సినిమా షూటింగ్ లో భాగంగా లాస్‌ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో  సెల్ఫీ దిగిన ఓ యువతి.. గంతులు వేస్తూ ప్రభాస్ చెంపను తడిమింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస‍్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement