‘దిల్‌ దివానే’ను దించేశారు.. వీడియో వైరల్‌

Couple Enjoying Dil Deewana Song In Youtube - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ప్రేమకథా చిత్రాల్లో ‘మై నే ప్యార్‌ కియా’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జోడిగా నటించిన ఈ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ​ప్రేమకథా చిత్రంతోనే చాక్‌లెట్‌ బాయ్‌ ఇమేజ్‌తో ‘ప్రేమ్‌’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్‌ చెరగని ముద్ర వేశాడు.

ఈ సినిమాలోని ‘దిల్‌ దివానే’ పాట చాలా పాపులర్‌ అయింది. తాజాగా ఓ జంట ఈ పాటను అనుకరిస్తు చేసిన డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాటలోని సాహిత్యానికి అనుగుణంగా ఈ జంట చేసిన అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు కూడా ఈ వీడియో నచ్చిందని పేర్కొంటూ నటి రవీనా టాండన్‌ తన ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో చూసి బాగా ఆస్వాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడిది అన్న వివరాలు వెల్లడి కాలేదు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top