వివాదంలో ‘భరత్‌ అనే నేను’ | Controversy On Mahesh Babu Bharat Ane Nenu Movie | Sakshi
Sakshi News home page

వివాదంలో ‘భరత్‌ అనే నేను’

May 10 2018 2:43 PM | Updated on May 28 2019 10:04 AM

Controversy On Mahesh Babu Bharat Ane Nenu Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ‘భరత్‌ అనే నేను’. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో వాడిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు కూడా తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు.

తమ పార్టీకి ఎన్నికల గుర్తింపు కూడా ఉందని.. అలాంటిది పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement