వివాదంలో అల్లు అర్జున్ డీజే | contraversy on allu arjun Dj | Sakshi
Sakshi News home page

వివాదంలో అల్లు అర్జున్ డీజే

Jun 2 2017 1:27 PM | Updated on Sep 5 2017 12:40 PM

వివాదంలో అల్లు అర్జున్ డీజే

వివాదంలో అల్లు అర్జున్ డీజే

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. ఈ సినిమాలో

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ఓ పాట వివాదానికి కారణమైంది. ఇటీవల ఈ సినిమాలో బడిలో గుడిలో అనే డ్యూయెట్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో బ్రాహ్మణుల మనో భావలు దెబ్బ తినేలా పద ప్రయోగాలు ఉన్నాయంటూ కొంత మంది అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.

శివుణ్ని పూజించే సమయంలో వాడే కొన్ని మంత్రాలను ఈ పాటలో తప్పుగా వినియోగించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రస్తుతానికి చిత్రయూనిట్ స్పందించలేదు. గతంలో ఇదే తరహాలో రూపొందిన అదుర్స్ సినిమాపై కూడా వివాదం చెలరేగింది. అయితే అప్పుడు చిత్రయూనిట్ అభ్యంతరకర పదాలను మార్చి సినిమాను రిలీజ్ చేశారు. మరి డీజే విషయంలో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement