
అతిథులకు ఆహ్వానం!
మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి సందర్భంగా దర్శకుడు మురుగదాస్ ఓ శుభవార్త చెప్పారు.
మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి సందర్భంగా దర్శకుడు మురుగదాస్ ఓ శుభవార్త చెప్పారు. మహేశ్–మురుగదాస్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా విడుదల తేదీ చెప్పేసి, మురుగదాస్ స్వీట్ షాక్ ఇచ్చారు.
‘‘జూన్ 23న సినిమాను రిలీజ్ చేయా లనుకుంటున్నాం. ఆ రోజు థియేటర్లలో మీరు (ప్రేక్షకులు) మా అతిథులు కావాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ కథానాయికగా నటిస్తున్నారు.