సన్నీ లియోన్కు శిల్పాశెట్టి బాసట | Comments on Sunny Leone's Condom Ad 'Silly,' Says Shilpa Shetty | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్కు శిల్పాశెట్టి బాసట

Sep 4 2015 3:25 PM | Updated on Sep 3 2017 8:44 AM

సన్నీ లియోన్కు శిల్పాశెట్టి బాసట

సన్నీ లియోన్కు శిల్పాశెట్టి బాసట

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. శృంగార తార సన్నీలియోన్కు బాసటగా నిలిచారు.

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. శృంగార తార సన్నీలియోన్కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. సన్నీ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి స్పందిస్తూ.. 'సన్నీ యాడ్పై విమర్శలు చేయడం హాస్యాస్పదం. అలా ఆలోచిస్తారని నేను భావించడం లేదు. దీని గురించి ఎక్కువగా స్పందించడం సరికాదు.  చేతి ఐదువేళ్లు సమానంగా ఉండవు. సానుకూల అంశాలపై మాత్రమే దృష్టిపెట్టాలి' అని శిల్పాశెట్టి అన్నారు. 'మ్యాన్ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది.

Advertisement
 
Advertisement
Advertisement