కాలనీలో కామెడీ | Comedy in Colony | Sakshi
Sakshi News home page

కాలనీలో కామెడీ

Jun 28 2014 1:09 AM | Updated on Sep 2 2017 9:27 AM

కాలనీలో కామెడీ

కాలనీలో కామెడీ

రొమాంటిక్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాలర్స్ కాలనీ’. ప్రిన్స్, నిఖితాపవార్ జంటగా నటిస్తున్నారు.

రొమాంటిక్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాలర్స్ కాలనీ’. ప్రిన్స్, నిఖితాపవార్ జంటగా నటిస్తున్నారు. శ్రీచంద్ ముల్లా దర్శకుడు. ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి నిర్మాతలు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లు, అలీ, సయాజీ షిండే, హేమ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. కామెడీ, గ్రాఫిక్స్ యువతరాన్ని ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రాత్రి నేపథ్యంలో పాటని చిత్రీకరిస్తున్నాం. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement