హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు | Comedian Srinivasa Reddy hero nephew | Sakshi
Sakshi News home page

హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు

Published Tue, Apr 7 2015 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన చంద్రశేఖర్ కానూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రాంతి నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. కల్కిమిత్ర కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్, సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ శర్మ.
 

Advertisement
Advertisement
Advertisement