హీరోగా మరో కమెడియన్ | comedian sapthagiri turn as a hero under sagar direction | Sakshi
Sakshi News home page

హీరోగా మరో కమెడియన్

Jan 17 2016 9:45 AM | Updated on Sep 3 2017 3:48 PM

హీరోగా మరో కమెడియన్

హీరోగా మరో కమెడియన్

అలీ, సునీల్, వేణుమాధవ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరో కామెడీ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అలీ, సునీల్, వేణుమాధవ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరో కామెడీ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ డిక్షన్తో ఆకట్టుకుంటున్న యంగ్ కమెడియన్ సప్తగిరి కూడా త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఓ సీనియర్ డైరెక్టర్ సప్తగిరిని హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమ కథాచిత్రం, జ్యోతి లక్ష్మీ, సౌఖ్యం లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న సప్తగిరి, సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాగర్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, నాగేశ్వర్ రెడ్డిలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోగా మారిన చాలా మంది కమెడియన్స్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండగా, సప్తగిరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement