ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ | comedian PrudhviRaj reacts about his character on Khaidi No. 150 movie | Sakshi
Sakshi News home page

ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ

Jan 5 2017 11:21 AM | Updated on Sep 5 2017 12:30 AM

ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ

ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్రపై కమెడీయన్ పృధ్వీ క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్రపై  కమెడీయన్ పృధ్వీ క్లారిటీ ఇచ్చారు. తన పాత్రను తగ్గించారన్నది అవాస్తమని ఆయన అన్నారు. ఖైదీ నం.150లో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని పృధ్వీ తెలిపారు. కొన్ని వెబ్‌ సైట్లు తాను చెప్పిన మాటలను వక్రీకరించాయని, చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాగా పృధ్వీ నటించిన కొన్ని సీన్లు ఎడిటింగ్‌లో కత్తెర పడినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

దీనిపై పృధ్వీ తాను నటించిన సీన్లు తొలగించడం దురదృష్టకరమని, సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ఖైదీ నం.150 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement