సిక్స్ప్యాక్ చేస్తోన్న స్టార్ కమెడియన్ | comedian 30 years prudhvi six pack avatar | Sakshi
Sakshi News home page

సిక్స్ప్యాక్ చేస్తోన్న స్టార్ కమెడియన్

Dec 12 2015 7:43 PM | Updated on Nov 6 2018 4:55 PM

సిక్స్ప్యాక్ చేస్తోన్న స్టార్ కమెడియన్ - Sakshi

సిక్స్ప్యాక్ చేస్తోన్న స్టార్ కమెడియన్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు. యంగ్ హీరోలు కూడా రిస్క్ అనుకునే సిక్స్ప్యాక్ సాధించటానికి కండలు కరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని పృథ్వి స్వయంగా ప్రకటించాడు. తెలుగులో మంచి ఫాంలో ఉన్న పృథ్వి ఇంత రిస్క్ తీసుకుంటుంది మాత్రం తెలుగు సినిమా కోసం కాదట. ఇప్పుడిప్పుడే కోలీవుడ్లో కూడా ఫాం అందుకుంటున్న ఈ కామెడీ స్టార్, ఓ తమిళ సినిమా కోసం సిక్స్ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు.

గతంలో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా సిక్స్ప్యాక్లో సందడి చేశాడు. అయితే సునీల్ హీరో అయ్యాకే సిక్స్ప్యాక్తో కనిపించాడు. కానీ పృథ్వి మాత్రం కామెడీ పాత్ర కోసమే ఇంత రిస్క్ చేస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో మూగవాడి పాత్రలో నటిస్తున్న పృథ్వి, ఆ సినిమా క్లైమాక్స్లో షర్ట్ విప్పి కనిపించే సీన్స్ ఉన్నాయట, ఆ సీన్స్లో సిక్స్ప్యాక్ చేస్తే బాగుంటుందని అజిత్ సలహా ఇవ్వటంతో ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు ఈ కామెడీ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement