స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర | Colours Swathi's Tripura Release Date | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

Oct 26 2015 11:58 PM | Updated on Sep 3 2017 11:31 AM

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

స్వాతి టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘త్రిపుర’. క్రేజీ మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో...

స్వాతి టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘త్రిపుర’. క్రేజీ మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. తమిళంలో ‘తిరుపుర సుందరి’గా వస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అనుకున్న కథను రాజకిరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్‌ప్లే ఓ హైలైట్. ‘స్వామి రారా, కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన మరో తెలుగు చిత్రమిది. ఆ కోవలోనే ఇదీ హిట్టవు తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు.

‘‘త్రిపుర ఏం చేస్తుంది? ఆమె కథేంటి అనేది సస్పెన్స్. స్వాతి అద్భుతంగా నటించింది. నవీన్‌చంద్ర చేసిన పాత్ర అదనపు ఆకర్షణ. సప్తగిరి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 29న పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజా, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సంగీతం: కమ్రాన్.

Advertisement
 
Advertisement
Advertisement