కష్టాలు..సంతోషాలు..! | C/O Surya Movie On Location Press Meet | Sakshi
Sakshi News home page

కష్టాలు..సంతోషాలు..!

Oct 12 2017 12:25 AM | Updated on Oct 12 2017 12:25 AM

C/O Surya Movie On Location Press Meet

సందీప్‌కిషన్‌ హీరోగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. మెహరీన్‌ కథానాయిక. చక్రి చిగురుపాటి నిర్మాత. డి.ఇమాన్‌ స్వరకర్త. షూటింగ్‌ కంప్లీట్‌ అయిన ఈ చిత్రాన్ని నవంబర్‌ రెండో వారంలో విడుదుల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నిజజీవిత సంఘటనలకు దగ్గరగా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ తీయడం సుశీంద్రన్‌ ప్రత్యేకత.

ఆయన తీసిన ‘నా పేరు శివ’ చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. వ్యక్తిగానూ ఆయన మంచి మనిషి. సుశీంద్రన్‌గారి సినిమాలో యాక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి క్యారెక్టర్‌లో నటించాను. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ వాళ్ల కష్టాలు, సంతోషాలను ఈ సినిమాలో చూపించాం. కథను నమ్మి నిర్మాతలు సినిమా తీశారు. డి. ఇమాన్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రైట్‌మూవీ ఇది.

‘నా పేరు శివ’లో నటించిన ఐదుగురు గ్యాంగ్‌ ఈ సినిమాలో కూడా నటించారు. నిర్మాత బాగా సహకరించారు. సందీప్, మెహరీన్‌ బాగా నటించారు. సినిమా హిట్‌ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు సుశీంద్రన్‌. ‘‘సందీప్‌ కెరీర్‌లో ఈ చిత్రం హిట్‌ మూవీగా నిలుస్తుంది. మెహరీన్‌కు మంచి పేరు వస్తుంది. నవంబర్‌ రెండో వారంలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. హీరోయిన్‌ మెహరీన్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

Advertisement
 
Advertisement
Advertisement