ఏ స్థాయి హిట్టో... | C/o Surya Hero Sundeep Kishan Interview | Sakshi
Sakshi News home page

ఏ స్థాయి హిట్టో...

Nov 10 2017 12:37 AM | Updated on Sep 15 2019 12:38 PM

C/o Surya Hero Sundeep Kishan Interview  - Sakshi

ఈరోజు తెలుస్తుంది‘‘చిన్నప్పుడు అమ్మ, నాన్న, బంధువులు మన కేరాఫ్‌. పెద్దయ్యాక కేరాఫ్‌ అంటే ఫ్రెండ్‌. స్నేహం కోణంలో నడిచే ఎమోషనల్‌ డ్రామా ‘కేరాఫ్‌ సూర్య’. ఈ చిత్రంలో నా పేరు సూర్య. నేను ఎవరెవరికి కేరాఫ్‌ అన్నదే కథ’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. సందీప్‌ కిషన్, మెహరీన్‌ జంటగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. శంకర్‌ చిగురుపాటి సమర్పణలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పత్రికలవారితో సందీప్‌ కిషన్‌ పంచుకున్న విశేషాలు.

► ఈ చిత్రంలో నా పాత్ర పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన పాత్ర చేశా. ‘నా పేరు శివ’ సినిమాలో కార్తీ పాత్రకు కొనసాగింపులా ఇందులో నా పాత్ర ఉన్నట్లు ఉంటుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లందరికీ మా సినిమా కూడా తప్పక నచ్చుతుంది.

► సుశీంద్రన్‌ చేసిన మొదటి స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. నేను వర్క్‌ చేసిన బెస్ట్‌ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు. కథ, పెర్ఫార్మెన్స్‌ మీద ఆయన ఎక్కువ వర్క్‌ చేస్తారు. టెక్నికల్‌ అంశాల మీద పెద్దగా దృష్టి సారించరు. అవి కథతో పాటే వెళ్లిపోతుంటాయి. ఇదొక నిజాయతీ కలిగిన సినిమా. అందుకే సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.

► ఈ చిత్రం తెలుగు, తమిళంలో వేర్వేరుగా తీస్తే 14 కోట్లు బడ్జెట్‌ అయ్యేది. రెండు భాషల్లో కలిపి చేయడంతో రూ. 10 కోట్లు అయింది. రెండు భాషల్లోనూ సినిమాను డీల్‌ చేయగల దర్శకుడితో పని చేయాలనుకుని చేశా. తెలుగు, తమిళానికి ఫస్టాఫ్‌లో పూర్తిగా తేడా ఉంటుంది. సెకండాఫ్‌ రెండు భాషల్లోనూ ఒకలానే ఉంటుంది.

► తమిళంలో ప్రివ్యూ వేశాం. చూసినవాళ్లంతా కచ్చితంగా సినిమా హిట్టవుతుందంటున్నారు. ఆ హిట్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఈరోజు సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. మెహరీన్‌ పాత్ర కొద్దిగా రౌడీలా బిహేవ్‌ చేస్తుంది. ఆమె కనిపించిన ప్రతిసారీ నవ్వుకుంటారు.

► ఎప్పటి నుంచో కృష్ణ్ణవంశీగారితో వర్క్‌ చేయాలనే కోరిక ‘నక్షత్రం’తో తీరింది. ఆ సినిమాతో నాకు మంచి నటుడు అనే పేరు వచ్చింది. కానీ, ఆ చిత్రం కోసం కొంచెం ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశాను.

► మంజులగారితో ఒక సినిమా, కునాల్‌ కోహ్లీతో ఒక తెలుగు స్ట్రయిట్‌ సినిమా , తమిళంలో కార్తీక్‌ నరేన్‌తో ‘నరగసూరన్‌’ అనే సినిమాలు చేస్తున్నా. అలాగే కార్తీక్‌ ఘట్టమనేనితో
ఓ సినిమా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement