‘సినిమా డే’ ఉండాలి! | Sakshi
Sakshi News home page

‘సినిమా డే’ ఉండాలి!

Published Sat, Apr 30 2016 10:41 PM

‘సినిమా డే’ ఉండాలి! - Sakshi

 ‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలా ‘సినిమా డే’ అని ఒక రోజుని కేటాయించాలి. ఆ రోజున చిత్రసీమలో ఉన్న 24 శాఖలకు సంబంధించినవాళ్లు ఒకే రకమైన దుస్తులు ధరించి, వేడుక చేసుకోవాలి’’ అని ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఈ ఇద్దరూ మాట్లాడుతూ - ‘‘ఫైటర్లుగా ఇండస్ట్రీకి వచ్చి, ఫైట్ మాస్టర్లుగా ఎదిగాం.

 ఎంతో ఇచ్చిన సినిమా పరిశ్రమకు ఏమిచ్చాం? అని ఆలోచించుకుంటే.. ఏమీ లేదనిపించింది. ఆ ఫీలింగ్‌లోంచి వచ్చిన ఆలోచనే ‘సినిమా డే’. కుల, మతాలకు అతీతంగా భాషా భేదం లేకుండా కళామతల్లి అందర్నీ ఆదరిస్తోంది. అలాంటి తల్లిని గౌరవించు కోవడం కోసం ప్రత్యేకంగా ఒక్క రోజు కూడా లేదు. అందుకే సినీ పెద్దలంద రూ ఆలోచించి ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement