‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్ | chuttalabbayi movie in sai kumar | Sakshi
Sakshi News home page

‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్

Mar 8 2016 4:49 AM | Updated on Sep 3 2017 7:12 PM

‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్

‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్

పేరవరం గౌతమీ గోదావరి చెంతన సోమవారం ‘చుట్టాలబ్బాయి’ సినీ సందడి నెలకొంది. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన నటులతో...

పేరవరం గౌతమీ గోదావరి చెంతన  సోమవారం ‘చుట్టాలబ్బాయి’ సినీ సందడి నెలకొంది. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన నటులతో గ్రామం కోలాహలంగా మారింది. హీరో ఆది, హీరోయిన్లు నమితా ప్రమోద్, యామిని, పృథ్వి, పోసాని కృష్ణమురళి, జీవా తదితరులపై వివిధ సన్నివేశాలను దర్శకుడు వీరభద్రం   తెరకెక్కించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌టీ మూవీస్ అండ్ ఐశ్వర్యలక్ష్మి బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ధవళేశ్వరం, కడియపులంక, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో ఈ నెల 20 వరకూ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

ఈ సినిమాలో ఒక విలక్షణ పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారని చెప్పారు. గతంలో అహ నా పెళ్లంట, పూలరంగడు, బాయ్ తదితర చిత్రాలు నిర్మించామన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్నివేశాలను అందంగా చిత్రీకరించేందుకు ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వీరభద్రం. సంగీతం ఎస్‌ఎస్ థమన్, నిర్మాత రామ్ తలారి.        - పేరవరం (ఆత్రేయపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement