ఇది రాగం కాదు | chitralahari regular shooting in october first week | Sakshi
Sakshi News home page

ఇది రాగం కాదు

Aug 21 2018 12:17 AM | Updated on Aug 21 2018 12:17 AM

chitralahari regular shooting in october first week - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌

చిత్రలహరి ప్రోగ్రామ్‌ షురూ అవ్వడానికి టైమ్‌ సెట్‌ చేశారు సాయిధరమ్‌ తేజ్‌. మరి ఈ కార్యక్రమంలో ట్యూన్స్‌ క్లాస్‌గా ఉంటాయా లేదా మాస్‌గా ఉంటాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.  ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, మోహన్‌ చెరుకూరి, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారు.

మేఘా ఆకాశ్‌ ఇందులో కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుంది. ఇదిలా ఉంటే చిత్రలహరి అంటే ‘రాగం’ అని తెలిసిందే. అయితే ఈ టైటిల్‌కి ‘బార్‌ అండ్‌ రెస్టారెంట్‌’ అనే ఉపశీర్షిక కూడా ఉండబోతోందని ప్రచారంలో ఉంది. అంటే.. బార్‌ పేరు చిత్రలహరి అయ్యుంటుందేమో. టైటిల్‌ చాలా క్లాస్‌గా ఉన్నప్పటికీ క్యాప్షన్‌ ఊర మాస్‌గా ఉంది.  సో.. సినిమా క్లాస్, మాస్‌ మిక్స్‌ అని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement