
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులూ జారీ చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చస్త్రశారు. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి,విధి విధానాలు రూపొందించి సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్విట్ చేశారు. (చదవండి : తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతులు )
కాగా, పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.
(చదవండి : పెంగ్విన్ టీజర్: సైకో ఎవరు?)