ఒకే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ | Chiranjeevi, Pawan Kalyan to attend Varun Tej debut film launch | Sakshi
Sakshi News home page

ఒకే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్

Feb 26 2014 1:37 PM | Updated on Mar 22 2019 5:33 PM

ఒకే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ - Sakshi

ఒకే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్: మెగా వంశం నుంచి మరో వారసుడి తెరంగ్రేటంకు రంగం సిద్ధమైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా రంగప్రవేశం చేయనున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రేపు షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాటీవితో పాటు పలు ప్రైవేటు చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయని చెప్పారు. ఒక సినిమా ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.

గతేడాది వరుణ్ తేజ్ వెండితెరకు పరిచయం కావాల్సివున్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను లియో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సివుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement