మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో | Chiranjeevi meelo evaru koteeswarudu Promo | Sakshi
Sakshi News home page

మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో

Sep 28 2016 1:54 PM | Updated on Jul 15 2019 9:21 PM

మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో - Sakshi

మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరు, అదే సమయంలో బుల్లితెర అరంగేట్రానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగు టెలివిజన్...

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరు, అదే సమయంలో బుల్లితెర అరంగేట్రానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు.

గత మూడు సీజన్లలో వ్యాఖ్యతగా స్టార్ హీరో నాగార్జున వ్యవహరించగా రాబోయే సీజన్లో మాత్రం ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. త్వరలో మా టివీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబందించి ఓ టీజర్ను రిలీజ్ చేశారు.  ఎక్కడ పూర్తిగా చిరు లుక్స్ రివీల్ చేయకుండా రూపొందించిన ఈ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. హీరోగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న చిరు బుల్లితెర మీద ఏమేరకు అలరిస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement