‘ట్రాఫిక్’లో ఏం జరిగింది? | 'Chennail Orunal' Dubbed In telugu As 'Traffic' | Sakshi
Sakshi News home page

‘ట్రాఫిక్’లో ఏం జరిగింది?

Jan 12 2014 11:58 PM | Updated on Sep 2 2017 2:34 AM

‘ట్రాఫిక్’లో ఏం జరిగింది?

‘ట్రాఫిక్’లో ఏం జరిగింది?

గులాబ్‌జామ్ రుచి చూడని వారెవరైనా ఉంటారేమో కానీ, ట్రాఫిక్ జామ్ గురించి తెలీనివారు ఎవ్వరూ ఉండరు. ఈ ట్రాఫిక్ కారణంగా ఓ అమ్మాయి జీవితం

గులాబ్‌జామ్ రుచి చూడని వారెవరైనా ఉంటారేమో కానీ, ట్రాఫిక్ జామ్ గురించి తెలీనివారు ఎవ్వరూ ఉండరు. ఈ ట్రాఫిక్ కారణంగా ఓ అమ్మాయి జీవితం ఎలా అల్లకల్లోలమైందనే నేపథ్యంలో మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించారు. 
 
ఆ చిత్రాన్ని తమిళంలో ‘చెన్నయిల్ ఒరునాల్’ పేరుతో రాడాన్ మూవీస్ పతాకంపై రాధిక రీమేక్ చేశారు. ప్రకాశ్‌రాజ్, రాధిక, శరత్‌కుమార్, చేరన్ ఇందులోముఖ్య పాత్రలు పోషించారు. షాహిద్ ఖాదర్ దర్శకుడు. హీరో సూర్య ఇందులో ప్రత్యేక పాత్ర చేయడం విశేషం. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘ట్రాఫిక్’ పేరుతో అనువాదమవుతోంది. గోల్డ్ స్టార్ సినీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మెజో జోసెఫ్, పాటలు-మాటలు: సాహితి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement