సాహో హీరోయిన్‌పై ఛీటింగ్‌ కేసు | cheating case against Shradda Kapoor | Sakshi
Sakshi News home page

సాహో హీరోయిన్‌పై ఛీటింగ్‌ కేసు

Sep 19 2017 1:02 PM | Updated on Sep 19 2017 4:46 PM

సాహో హీరోయిన్‌పై ఛీటింగ్‌ కేసు

సాహో హీరోయిన్‌పై ఛీటింగ్‌ కేసు

ప్రభాస్ సాహో మూవీ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ పై ఛీటింగ్ కేసు నమోదు అయ్యింది. అగ్రిమెంట్‌..

సాక్షి, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ పై ఛీటింగ్ కేసు నమోదయ్యింది. తన తాజా చిత్రం విషయంలో శ్రద్ధ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ప్రముఖ సంస్థ ఏజే మిస్ట్రీ అండ్‌ తియా మిన్హాస్‌ దావా వేసింది.  
 
శ్రద్ధా కపూర్‌ తాజాగా హసీనా పార్కర్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు ఏజేటీఎం సంస్థ దుస్తులు సమకూర్చింది. చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో కూడా తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని శ్రద్ధా, చిత్ర నిర్మాతలతో ఏజేటీఎం ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఆమె అలాంటిదేం చేయకుండానే ప్రమోషన్‌లలో పాల్గొంటోంది.
 
దీంతో సదరు సంస్థ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌తోపాటు చిత్ర నిర్మాతలపైనా ముంబై కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 26న ఈ కేసు బెంచ్ ముందుకు రానుంది. మాఫియా డాన్‌ దావూద్‌ సోదరి జీవిత ఇతివృత్తంగా హసీనా పార్కర్‌ రూపొందిన విషయం తెలిసిందే. మరోవైపు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌తోపాటు ప్రభాస్‌ సాహోలో కూడా శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement