
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ-2 మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. నాగిన్ మూవీతో పాటు మరో రెండు చిత్రాల్లో కనిపించనుంది. అటు షూటింగ్లతో బిజీగా ఉండే శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా నెట్టింట పోస్టులు పెడుతూనే ఉంది.
గతంలో స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో శ్రద్ధాపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ముంబయిలో డిన్నర్ డేట్ తర్వాత అతనితో కలసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి. ఆ తర్వాత చాలాసార్లు అతనితో కలిసి జంటగా కనిపించింది.అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ మెరిశారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది.
తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. మీ కోపా తాపాలను భరించే వ్యక్తి మీ లైఫ్లో కనుగొనండి అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోదీని ట్యాగ్ చేసింది. ఆ వీడియోను రాహులే తీసినట్లు తెలుస్తోంది. మీ జీవితంలో హట్ లాంటివి వినే వాళ్లు ఎవరై ఉంటారని హింట్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు రాహుల్తో డేటింగ్ కన్ఫామ్ చేసేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోతో రాహుల్తో డేటింగ్లో ఉన్నట్లు పరోక్షంగానే చెప్పేసిందని పోస్ట్ చేస్తున్నారు.
గతడాది డిసెంబర్‌లోనూ రాహుల్‌తో వడా పావ్ డేట్ గురించి పోస్ట్ చేసింది. అంతకుముందు ఆమె ఫోన్ వాల్‌పేపర్‌లో అతనితో దిగిన ఫోటోతో దొరికిపోయింది. ఇవాళ పోస్ట్ చేసిన వీడియోతో వీరిద్దరి డేటింగ్ ఉన్నట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'స్త్రీ- 2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ ద్వివేది తెరకెక్కిస్తోన్న 'నాగిన్'లో కనిపించనుంది.