శ్రీ‘దేవి’ భక్తుడు రామ్‌గోపాల్‌ వర్మ..

charmi post rgv video on her instagram - Sakshi

సాక్షి, సినిమా: రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నటి ఛార్మి తాజాగా వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో తెలుపుతూ  సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో  ఆయన కింద కూర్చొని కన్నార్పకుండా అతిలోకసుందరి పాటను వీక్షిస్తూ కనిపించారు. వర్మ తనదైన ప్రపంచంలో ఎవ్వరినీ పట్టించుకోకుండా ఆ పాటలో లీనమైపోయి చేస్తున్నారు.

సన్నీడియోల్, శ్రీదేవి కలిసి నటించిన ఛాల్‌బాజ్ అనే హిందీ మూవీలో 'నా జానే కహాసే..' అనే పాటను వర్మ చూపు తిప్పకుండా చూస్తున్నారు. ఈ వీడియోకు ఛార్మి క్యాప్షన్‌గా.. ‘భక్తుడు రామ్‌గోపాల్‌ వర్మ.. శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం’ అని పోస్ట్‌ చేశారు.

‪N the worshiper is here @rgvzoomin on the floor for @sridevi.kapoor .. ‬ ‪Ramuism n his fanism 😍‬

A post shared by Charmmekaur (@charmmekaur) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top