మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ | Chandrababu Naidu consoles Murali Mohan | Sakshi
Sakshi News home page

మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ

Published Mon, Jun 3 2019 1:01 PM | Last Updated on Mon, Jun 3 2019 1:13 PM

Chandrababu Naidu consoles Murali Mohan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున‍్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ సోమవారం హైదరాబాద్‌లోని మురళీమోహన్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా మురళీమోహన్‌ను ఇప్పటికే సినీనటుడు చిరంజీవి దంపతులు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement