నా సేవలు కొనసాగిస్తా

Champions of Change 2019 award for Allu Aravind - Sakshi

– అల్లు అరవింద్‌

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ‘చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top