‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్‌ చేయండి’

Censor Board Cuts Sara Ali Khan And Kartik Aaryan Kissing Scenes In Love Aaj Kal - Sakshi

సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌, యువ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌లు నటిస్తున్న ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్‌ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్‌ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్‌ చేయాలని చెప్పింది.

అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్‌ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్‌ చేసింది. మరోవైపు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2009లో సైఫ్‌ అలీఖాన్‌, దీపికా నటించిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్‌ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

చదవండి :  కార్తిక్‌తో ఆ సీన్‌లో నటించాలని ఉంది: నటి కూతురు

‘ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top