సెల్‌.. నో ఎంట్రీ!

Cell phones no entry sahoo shooting - Sakshi

... ఈ మాట వినగానే ఒక్కసారి గుండె ఆగినంత పనైందా? అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినట్లు ‘సెల్‌ ఫోన్లు బంద్‌’ అనే ప్రకటన ఏమైనా చేశారా? నోట్లు రద్దయినా తట్టుకున్నాం కానీ... చేతిలో సెల్‌ (మొబైల్‌) లేకుంటే ఎలా? బాడీలో ఏదో పార్ట్‌ తీసేసినట్టే కొందరు ఫీలవుతుంటారు. ఈ సెల్‌కి బంద్‌.. ప్రజలకు కాదు! ‘సాహో’ యూనిట్‌కి మాత్రమే! మేటర్‌ ఏంటంటే... ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగులోకి ఇకపై సెల్‌ ఫోన్స్‌కి ఎంట్రీ లేదట.

షూటింగ్‌ స్పాట్‌కి ఎవరూ సెల్‌ ఫోన్లు తీసుకురాకూడదని రూల్‌ పెట్టారట. ఎందుకంటే... భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సిన్మా స్టిల్స్, లొకేషన్లో ఫొటోలు బయటకొస్తే సినిమా రిలీజ్‌ సమయానికి ఇంట్రెస్ట్‌ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే... లాకర్‌ రూమ్‌లో పెడుతున్నారట. గుడికో, బడికో వెళితే లాకర్‌రూమ్‌లో పెడతారు కదా, అలాగ! త్వరలో దుబాయ్‌లోని అబుదాబీలో జరగనున్న షెడ్యూల్‌ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందట. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top