రచయితగా మారిన స్టైలిస్ట్ | Celeb Stylist neeraja kona Turns Thikka Lyricist | Sakshi
Sakshi News home page

రచయితగా మారిన స్టైలిస్ట్

Jul 31 2016 10:52 AM | Updated on Sep 4 2017 7:13 AM

రచయితగా మారిన స్టైలిస్ట్

రచయితగా మారిన స్టైలిస్ట్

నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్కు స్టైలిస్ట్గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా...

నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్కు స్టైలిస్ట్గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది.

సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వెళ్లిపోకే అని పాట రాసిన నీరజ ఇక ముందు కూడా గేయ రచయిత్రిగా కొనసాగుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement