పాటల బెల్ మోగింది... | Calling Bell Movie Audio Launchd | Sakshi
Sakshi News home page

పాటల బెల్ మోగింది...

Mar 16 2015 11:00 PM | Updated on Sep 2 2017 10:56 PM

పాటల బెల్ మోగింది...

పాటల బెల్ మోగింది...

హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా

హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా షేక్ అన్వర్ బాషా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకుడు. సుకుమార్ స్వరాలు అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి. కల్యాణ్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుందంటే సినిమా బాగుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని, ఇది ఒక మాస్ హారర్ అని పన్నా రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్, మనోజ్ నందం, సునీల్‌కుమార్ రెడ్డి, మాదాల రవి, రవివర్మ, మమత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement