కమెడియన్ల పిల్లలు కమెడియన్లు కాదు...

Brahmanandam speech at Krishna Rao Supermarket pre release - Sakshi

– బ్రహ్మానందం

కమెడియన్‌ గౌతంరాజ్‌ నిర్మాతగా ఆయన కుమారుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’. శ్రీనాథ్‌ పులకరం దర్శకుడు.  ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రం బిగ్‌ సీడీని అనిల్‌ రావిపూడి, ట్రైలర్‌ను బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ‘మా’ అధ్యక్షుడు వి.కే. నరేశ్‌లతో పాటు తనికెళ్లభరణి, బెనర్జీ, కృష్ణభగవాన్, శ్రీనివాస్‌ రెడ్డి,  చిట్టిబాబు, అలీ, రాజీవ్‌ కనకాల, తదితరులు పాల్గొన్నారు. నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘గౌతమ్‌ 400 సినిమాలకు పైగా నటించారు. నాకు 30 ఏళ్లుగా మంచి స్నేహితుడు.

అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న గౌతంరాజు నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘హాస్య కుటుంబం నుండి వచ్చిన పిల్లలు హాస్యానికే పరిమితం అనుకుంటారు. అది నిజం కాదు అని నిరూపించుకోవటానికే కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. గౌతంరాజు మాట్లాడుతూ– ‘‘నా మీద అభిమానంతో ఇంతమంది ఇక్కడికొచ్చి నా కొడుకును ఆశీర్వదించారు. ఇంతమంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీనా«థ్‌ పులకరంకి థ్యాంక్స్‌’’ అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ చిత్రమిది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top