బోయపాటికి హీరో దొరికాడా? | Boyapati Srinu Next Movie With Nikhil Gowda | Sakshi
Sakshi News home page

బోయపాటికి హీరో దొరికాడా?

Jul 30 2019 3:33 PM | Updated on Jul 30 2019 3:33 PM

Boyapati Srinu Next Movie With Nikhil Gowda - Sakshi

మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్‌ రావటంతో ఈ యాక్షన్‌ దర్శకుడు ఆలోచనలో పడ్డాడు. చాలా కాలంగా బోయపాటి నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ కన్నడ యంగ్ హీరోతో ప్లాన్‌ చేస్తున్నారట. జాగ్వర్ సినిమాతో టాలీవుడ్, సాండల్‌వుడ్‌లకు ఓకేసారి పరిచయం అయిన నిఖిల్ గౌడ హీరోగా బోయపాటి తదుపరి చిత్రాన్న ప్లాన్ చేస్తున్నారట. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, బోయపాటి సినిమాతో మరోసారి టాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement