పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు | Box office collection: 'The Jungle Book' to surpass Akshay's 'Airlift' | Sakshi
Sakshi News home page

పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు

Apr 24 2016 1:58 PM | Updated on Sep 3 2017 10:39 PM

పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు

పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు

హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది.

ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు రూ. 150 కోట్లకు చేరువవుతున్నాయి. మూడు వారాల్లో ఈ సినిమా రూ. 132.96 కోట్లు వసూలు చేసినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మూడో వారాంతంలోనూ 'ది జంగిల్ బుక్' జోరు తగ్గలేదు. శుక్రవారం రూ.3.58 కోట్లు, శనివారం 6.65 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

అక్షయ్ కుమార్ 'ఎయిర్ లిఫ్ట్' కలెక్షన్లను అధిగమించి హిందీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ ప్రపంచవ్యాప్తంగానూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement