
‘మీరు రతన్ టాటాలా ఉంటారు’ అనే కామెంట్స్‌ని సోషల్ మీడియాలో చాలాసార్లు విన్నాను. ఇప్పుడు రతన్ టాటా పాత్రనే పోషిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు బొమన్ ఇరానీ. దేశప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌లో రతన్ టాటా పాత్రను పోషిస్తున్నారాయన. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ ముఖ్యపాత్రలో ‘పీయం నరేంద్ర మోది’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది.
సందీప్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ నిర్మాతలు. ‘‘దర్శకుడు ఒమంగ్, వివేక్ ఒబెరాయ్ ఈ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అంగీకరించాను. అద్భుతమైన టీమ్ కుదిరింది. నా పార్ట్ çషూటింగ్ ముగిసింది. చాలా అద్భుతంగా వచ్చింది’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు బొమన్ ఇరానీ.