‘ప్రియా నీ హావభావాలు చూడ ముచ్చటగా..’ | bollywood director rishi kapoor tweets on priya prakash varrier | Sakshi
Sakshi News home page

‘ ప్రియా నీ హావభావాలు చూడ ముచ్చటగా.. ’

Feb 18 2018 7:06 AM | Updated on Apr 3 2019 6:23 PM

bollywood director rishi kapoor tweets on priya prakash varrier - Sakshi

మలయాళం భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

మలయాళం భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో స్టార్‌గా మారి సంచలనం సృష్టించింది.  ఆమె నటించిన సినిమా ‘ఒరు అడార్ లవ్’’ . ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో గతవారంలో విడుదల అయింది. దాంట్లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్‌ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ  ప్రియాకు ఫ్యాన్స్‌ అయ్యారు.

ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌ లిస్ట్‌లో చేరిపోయ్యాడు బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు రిషి కపూర్‌. ఇటీవల ఆమె వీడియో చూసిన ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘ ప్రియాకు ఊహించని స్టార్‌ డమ్‌ వచ్చింది. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాను. మై డియర్‌ ప్రియా .. నీ వయస్సు వాళ్లకు నీవు స్ఫూర్తిగా నిలుస్తున్నావు. ఈ వీడియో నీ హావభావాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. గాడ్‌ బ్లెస్‌, ఆల్‌ ది బెస్ట్‌’ అని రిషి కపూర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెకు క్రేజ్‌ పెరిగిపోయింది. ప్రియా ప్రస్తుతం కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్‌’లో బీకామ్‌ చదువుతోంది. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ మలయాళ చిత్రంలో హీరోయిన్‌ ప్రియా వారియర్‌ కనుగీటిన సన్నివేశం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్‌ లవ్‌ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement