డేట్‌ రెడీ | bollywood arjun reddy regular shooting starts | Sakshi
Sakshi News home page

డేట్‌ రెడీ

Sep 10 2018 1:49 AM | Updated on Apr 3 2019 6:34 PM

bollywood arjun reddy regular shooting starts - Sakshi

షాహిద్‌ కపూర్‌

బాలీవుడ్‌ అర్జున్‌ రెడ్డి తన ప్రయాణాన్ని స్టార్ట్‌ చేయడానికి డేట్‌ రెడీ చేసుకున్నారు. ఒక్కసారి స్టార్ట్‌ అయితే ఇక నో బ్రేక్స్‌ అంటున్నారు. గతేడాది తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘అర్జున్‌ రెడ్డి’ బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగానే ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. పలుమార్లు డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 19న స్టార్ట్‌ కానుంది. ఈ క్యారెక్టర్‌ కోసం మరింత గడ్డం పెంచడానికి టైమ్‌ తీసుకున్నారు షాహిద్‌ కపూర్‌. తొలుత ఈ సినిమాలో తారా సుతారియాని హీరోయిన్‌గా అనుకున్నారు కానీ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement