సన్నీ లియోన్‌ ‘వీర’ లుక్‌ చూశారా? | Bollywood actress SunnyLeone new avatar | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌ ‘వీర’ లుక్‌ చూశారా?

Feb 9 2018 8:54 AM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood actress  SunnyLeone new avatar - Sakshi

సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’  షూటింగ్ కార్యక్రమాలు బుధవారం  ప్రారంభమైనాయి.  మూవీలో పవర్ ఫుల్ క్వీన్ పాత్ర పోషించన్ను బాలీవుడ్ నటిసన్నీలియోన్‌ ఫిబ్రవరి 7న వీర మహాదేవి షూటింగ్‌ మొదలైందంటూ సోషల్‌మీడియాలో  ప్రకటించారు.  తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.  ఇటుకలను ఒంటిచేత్తో  ఒక్క దెబ్బకు పడగొడుతున్న ఫోటోను  ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నేను కొడితే  మొత్తం అన్ని ఇటుకులు దెబ్బకు నుజ్జునుజ్జు కావాల్సిందే.. అంటూ ట్వీట్‌ చేశారు.  

మొట్టమొదటిసారిగా సౌత్ లో, అందులోనూ తెలుగులో పూర్తి స్థాయిలో నటిస్తుండటంతో నిర్మాతలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంతేకాదు యుద్ధ సన్నివేశాలకోసం కత్తిసాము, గుర్రపు స్వారీ, తదితర విద్యల్లో స్పెషల్ ట్రెయినింగ్  కూడా తీసుకుంటోందట. తమిళంలో వీరమాదేవి అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం తెలుగులో వీరమహాదేవి అనే టైటిల్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.  స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టీఫెన్  నిర్మాతగా వ్యవహరిస్తుండగా వి.సి.వడివుడయన్ దర్శకుడు.   నవదీప్, నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement