హుమా ఖురేషి క్వీన్ అవుతుందా? | bollywood actor huma qureshi | Sakshi
Sakshi News home page

హుమా ఖురేషి క్వీన్ అవుతుందా?

Sep 20 2014 2:26 AM | Updated on Sep 2 2017 1:39 PM

హుమా ఖురేషి క్వీన్ అవుతుందా?

హుమా ఖురేషి క్వీన్ అవుతుందా?

బాలీవుడ్ నటి హుమా ఖురేషి క్వీన్ చిత్ర నాయకి అవుతుందా?. కోలీవుడ్‌లో తాజాగా చర్చల్లో నలుగుతున్న పేరు ఈ బ్యూటీదే.

బాలీవుడ్ నటి హుమా ఖురేషి క్వీన్ చిత్ర నాయకి అవుతుందా?. కోలీవుడ్‌లో తాజాగా చర్చల్లో నలుగుతున్న పేరు ఈ బ్యూటీదే. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఒరిజినల్‌లో నటించిన కంగణా రనౌత్ పాత్రను దక్షిణాదిలో నటించిన నటి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ప్రముఖ నటీమణులు నయనతార, త్రిష, సమంత, కాజల్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా హుమా ఖురేషి పేరు వెలుగులో కొచ్చింది.

ఈ బ్యూటీ ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రంలో నటించింది. ఇప్పుడీ భామ దక్షిణాది క్వీన్ కాబోతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయం గురించి దర్శక, నిర్మాత త్యాగరాజన్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే హుమా ఖురేషి క్వీన్ చిత్ర రీమేక్‌లో నటించే విషయమై తనను సంప్రదించిందని చెప్పారు. అయితే ఈ విషయం గురించి తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ప్రశాంత్ హీరోగా నటిస్తున్న సాహసం చిత్రం పైనే ఉన్నట్లు చెప్పారు. క్వీన్ చిత్రం వచ్చే ఏడాది మార్చిలోనే సెట్‌పై వెళుతుందని త్యాగరాజన్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement