బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం | Bigg Boss 3 Telugu Task Goes Violent In Seventh Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

Sep 3 2019 10:58 PM | Updated on Sep 3 2019 11:00 PM

Bigg Boss 3 Telugu Task Goes Violent In Seventh Week - Sakshi

దొంగలు దోచిన నగరం టాస్క్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌ అంతా గందరగోళంగా మారింది. హింసకు తావివ్వొద్దంటే.. హింసే ప్రధానంగా జరిగినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా రాహుల్‌ కాలికి గాయమై రక్తం కారింది. నిధిని కాపాడే ప్రయత్నంలో శివజ్యోతి, రవి చాలా కష్టపడ్డారు. వరుణ్‌-వితికాలు గొడవపడటం, శ్రీముఖి.. పునర్నవిని పట్టుకోవడం, హిమజ.. శిల్పాను పట్టుకుని ఉండటం.. హైలెట్‌గా నిలిచింది.

దొంగలు దోచిన సరుకులన్నీ వారి ఆధీనంలో ఉంటాయని.. దొంగలకు రాణి శిల్పా చక్రవర్తి అని ఆ గ్యాంగ్‌లోని సభ్యులుగా పునర్నవి, రాహుల్‌, వరుణ్‌, రవి, శివజ్యోతి ఉంటారని తెలిపారు. మహేష్‌, అలీ, హిమజ, బాబా భాస్కర్‌, వితికా, శ్రీముఖిలను నగరవాసులుగా ఉంటారని ఆదేశించాడు. దొంగల రాణి ఫోటోలను నాశనం చేయడం, వారి జెండాలను తీసిపారేయడంలాంటివి నగరవాసులు చేస్తూ ఉంటే దొంగల ముఠా వాటిని రక్షించుకుంటూ ఉండాలి. చివరకు దొంగల రాణి చేతిలో ఉన్న తుపాకిని నగరవాసులు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్‌లో హింసకు చోటు ఉండకుండదని ఆదేశించాడు. కానీ టాస్క్‌లో హింస మితిమీరిపోయినట్లు కనిపిస్తోంది.

శ్రీముఖి కావాలనే రాహుల్‌ను టార్గెట్‌ చేస్తోందని, టాస్క్‌లో భాగంగా తనను కూడా పట్టుకుంటున్నారని అయితే తనలా అరవడం లేదంటూ శ్రీముఖిపై పునర్నవి ఫైర్‌ అయింది. జెండాలను కాపాడే ప్రయత్నంలో వరుణ్‌ సందేశ్‌ గట్టిగా ప్రయత్నించినా విఫలమయ్యాడు. అందరూ కలిసి వరుణ్‌పై పడేసరికి చివరికి చేతులెత్తేశాడు. రాహుల్‌-అలీరెజాలు కొట్టుకునేంతా పని చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌లో నిధిని కాపాడే ప్రయత్నంలో అలీ, రాహుల్‌, మహేష్‌, రవిలు చాలా కష్టపడ్డారు.

సింహాసనంపై కూర్చున్న శిల్పాను, ఆమె చేతిలో ఉన్న తుపాకిని తీసుకునేందుకు అందరూ ఆమెపై పడ్డారు. అయినా ఆమె వారందర్నీ నిరోదిస్తూ ఉండగా.. పునర్నవి, రాహుల్‌, శివజ్యోతి వచ్చి మద్దతుగా నిలిచారు. ఎపిసోడ్‌ చివరకు వచ్చేసరికి రాహుల్‌ కాలికి గాయకావడం.. దీంతో ఆటకు విరామం ఇవ్వడం.. ఆ సమయంలో వితికా తుపాకిని తీసుకురావడంతో వరుణ్‌ సందేశ్‌ ఆమె వద్ద నుంచి లాక్కుని హెచ్చరించాడు. రాహుల్‌కు గాయమైందని చెబుతున్నా.. వినకుండా ఎందుకలా చేస్తున్నావంటూ ఫైర్‌ అయ్యాడు. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో మరింత హింస జరిగేట్టు కనిపిస్తోంది. మరి ఈ టాస్క్‌లో దొంగల ముఠా గెలుస్తోందో? నగరవాసులు గెలుస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement