బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌ | Bigg Boss 3 Telugu Srimukhi May Target Rahul Sipligunj | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

Sep 5 2019 6:54 PM | Updated on Sep 5 2019 6:54 PM

Bigg Boss 3 Telugu Srimukhi May Target Rahul Sipligunj - Sakshi

శ్రీముఖి-రాహుల్‌ బయట మంచి స్నేహితులమంటూ మొదట్లో బాగానే కలిసి ఉన్నారు. అయితే రానురాను బిగ్‌బాస్‌ హౌస్‌లో వీరిద్దరి మధ్య దూరం పెరుగతూనే ఉంది. అది ఎంతకి తగ్గేట్టు కనిపించడం లేదు. రాహుల్‌ ఏం చేసినా.. శ్రీముఖికి తప్పులానే కనిపిస్తున్నట్లు ఉంది. ఇలా ఒక్కర్ని పదేపదే అకారణంగా టార్గెట్‌ చేస్తూ ఉంటే.. చివరకు ఏమవుతుందో గత సీజన్‌లోనే చూశాం.

రెండో సీజన్‌లో కూడా ఈమాదిరిగానే కౌశల్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. అతను ఏం చేసినా తప్పన్నట్లే చిత్రీకరించారు. అతనికి లోపల కొన్ని అవకాశాలు రాగా.. బయట కౌశల్‌ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయేవారు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు అలాంటి ఒక్క కంటెస్టెంట్‌ కూడా వెలుగులోకి రాలేకపోయారు. మొదట్లో మహేష్‌కు కొంత పాజిటివ్‌గా కనిపించినా.. ప్రస్తుతం తన ఆట వెలుగులోకి రాలేకపోతోంది. అందరిలా మామూలుగానే ఆడేస్తున్నాడు. ఇక హిమజ కూడా డిఫెండర్‌గా బాగానే నెట్టుకొస్తున్నా.. తనకూ కొన్ని ప్రతికూల విషయాలు ఉన్నాయి. 

శ్రీముఖితో గొడవలు, పునర్నవితో ప్రేమ వ్యవహారం కారణంగా రాహుల్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రాహుల్‌ను బద్ద శత్రువుగా చూస్తు వస్తున్న శ్రీముఖి.. అతడ్ని పదేపదే టార్గెట్‌ చేయడంతో ఆమెకే నెగెటివ్‌ అవుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొన్నటి సీక్రెట్‌ టాస్క్‌లో కూడా రాహుల్‌ తరీఖా నచ్చలేదని కామెంట్లు చేసింది. ఇక రీసెంట్‌ నిన్నటి ఎపిసోడ్‌లో కూడా అక్కడ అలీ రెజా అగ్రెసివ్‌ అయినా.. అతడి పేరు చెప్పకుండా రాహుల్‌-రవి పేర్లను చెప్పింది. పైగా ముందునుంచి కోపం పెట్టుకుని ఈ పేరు చెప్పడం లేదంటూ.. రాహుల్‌ ఆడిన విధానం తనకు నచ్చలేదని పేర్కొంది. 

తన చేతులను పట్టుకున్నాడని.. అందుకే రవి పేరు చెబుతున్నానని శ్రీముఖి తెలిపింది. చేతులు పట్టుకుంటూనే చెబుతావా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఏమైనా చెయ్యోచ్చా? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా అతడ్ని టార్గెట్‌ చేయడం వల్ల.. రాహుల్‌కే మంచి పేరు వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement