బిగ్‌బాస్‌లో గలాట : ఆసుపత్రిపాలైన శ్రీశాంత్‌! | Bigg Boss 12 Contestant Sreesanth Rushed to Hospital | Sakshi
Sakshi News home page

Dec 3 2018 3:07 PM | Updated on Dec 3 2018 3:07 PM

Bigg Boss 12 Contestant Sreesanth Rushed to Hospital - Sakshi

తలను గోడకేసి బాదుకోవడంతో శ్రీశాంత్‌ గాయపడ్డాడు..

ముంబై : వివాదాస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌.. అనూహ్యంగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-12లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అసలే కోపిష్టి అయిన శ్రీశాంత్‌కు ఓపిక కూడా కొంచెం తక్కువ.. ఈ తరహా ప్రవర్తనతో హౌస్‌లో అతను చేసే ప్రతిపని వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఈ యాటిట్యూడ్‌తో అతనికి అభిమానులు బాగా కనెక్ట్‌ అయ్యారు. అయితే ఇటీవల హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శ్రీశాంత్‌ ఆసుపత్రిపాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతని సతీమణి భువనేశ్వరే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

ఇటీవల తోటీ హౌస్‌ మేట్‌ అయిన సురభి రానాతో అతను తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో ఈ ఇద్దరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరిపై హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ గుస్సా అయ్యాడు. వాళ్లు వాడిన పదజాలంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్‌ ఛీటర్‌ అని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడ్డాడని సురభి తిట్టగా.. ఆమో ఓ వ్యభిచారని శ్రీశాంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో తన తప్పును తెలుసుకున్న శ్రీశాంత్‌ ఆమెకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. అనంతరం మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడానా? అని కుంగిపోయిన శ్రీశాంత్‌.. వాష్‌రూంలోకి వెళ్లి డోర్‌ పెట్టుకున్నాడు. ఇది గమనించిన తోటి హౌస్‌మేట్స్‌.. అతన్ని బయటకు రమ్మని కోరగా అతను నిరాకరించాడు. అనంతరం తన తలను గోడకేసి బాదుకోవడంతో గాయపడ్డాడు.

వెంటనే నిర్వాహకులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని, శ్రీశాంత్‌ తిరిగి హౌస్‌లోకి వచ్చారని అతని భార్య ట్విటర్‌లో స్పష్టం చేశారు. ఇక శ్రీశాంత్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్‌పాలోయింగ్‌ పెరిగింది. సురభితో గొడవ నేపథ్యంలో అతనికి మద్దతుగా #WeStandBySreesanth అనే హ్యాష్‌ టాగ్‌తో మద్దతుగా నిలిచారు. ఒక అభిమాని అయితే ఏకంగా హౌస్‌ నుంచి బయటకు రాగానే సురభి గ్యాంగ్‌ రేప్‌కు గురవుతుందని హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో సదరు అభిమాని ఆ ట్వీట్‌ తొలిగించి క్షమాపణలు కోరాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement