'అహల్య' అద్భుతం: అమితాబ్ | Big B lauds Sujoy Ghosh's 'Ahalya' | Sakshi
Sakshi News home page

'అహల్య' అద్భుతం: అమితాబ్

Jul 23 2015 5:01 PM | Updated on Sep 3 2017 6:02 AM

'అహల్య' అద్భుతం: అమితాబ్

'అహల్య' అద్భుతం: అమితాబ్

దర్శకుడు సుజోయ్ ఘోష్ తీసిన 'అహల్య' షార్ట్ ఫిలింపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.

దర్శకుడు సుజోయ్ ఘోష్ తీసిన 'అహల్య' షార్ట్ ఫిలింపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ షార్ట్ ఫిలింలో సౌమిత్ర చటర్జీ, రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. 14 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం.. పురాణాల్లోని అహల్య పాత్ర ఆధారంగా తీసినదే.

'షార్ట్ ఫిలింల మ్యాజిక్ అంటే ఇదే.. సుజోయ్ ఘోష్ అద్భుతం' అని అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతోపాటు షార్ట్ ఫిలిం లింకు కూడా షేర్ చేశారు. దాంతో సంబరపడిపోయిన సుజోయ్ ఘోష్.. 'ఐ లవ్యూ సర్' అంటూ సమాధానం ఇచ్చాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement